Saturday, October 3, 2015

Safehouse

Yes you are my safe house
I can open the locks........
Lift the curtains
and ...let the windows fly open.

As you engulf like the ocean breeze!
Gently filling room after room...
Transforming everything you hover over
 and leaving a finger print in every encounter

Here is all of me on the altar..
Swearing in the Spirit 
To live is You!
Every dream and desire is You!

No thing apart from you!
On earth or in heaven!
In all of the Universe existent and to be!
Your love alone is my safe house!

Thursday, October 1, 2015

Unconditional? Forgiveness!!


for all the times i held back
for all the times i wasn't enough
for all the times i wasn't love
would you forgive me?

for all the times i passed by a hungry stranger
for all the times i didn't care about the prisoners/people
for all the times i had living water but feared the thirsty
would you forgive me?

for all the times i had access to your perfect love
yet for all the times i gave room for fear and doubt
for all the times i didn't let love in 
would you forgive me!

Dare I say forgive my trespasses as i forgive  my trespassers?
But may I plead ? Would you bless my forgiveness to be like yours? Unconditional?

a wilful slave :)

శుద్ధంగా సుప్రభాతపు సాంబ్రాణిలా,  గదులన్నీ కలియదిరిగిన సన్న గజ్జెల మేల్కొలుపు
గుండెచప్పుళ్ళకు కృతజ్ఞతగా నలిచిన మరువపు కొమ్మంత కమ్మని ఉదయప్రార్ధనలు
రాలిన ఉసిరి పూలతో పోటీపడే నీ చేతి కొబ్బరి ఈనెలు                                                                    -----------( చీపిరి ) 
తడారని ప్రేమకు మరల విరగబూసిన తెల్లచేమంతులు
గిన్నెలకు సరిగమలు నేర్పుతూ   చేతి  మట్టి గాజులు
అలసి సర్దిన ముంగురుల ధాటికి  ముద్దుగా వొణికే చెవి బుట్టలు
మునివేళ్ళ  మాయలా మూరెడు దారానికి పూచిన పూలపేటలు
నిదుర కౌగిట్లోకి జార్చేందుకు నువు తురిమిన విరజాజుల జోలపాటలు
 మగతగా వినిపించే కీచురాళ్ల  గుసగుసల మధ్య  ఊపిరంత వెచ్చని వేసవి గురుతులు..................................................
ఆకాశపు పండక్కి ముస్తాబైన జాబిల్లికూనలు చుక్కలు
 మేఘాలను తోసుకుంటూ  జాబిలమ్మ జిలుగులు 
నీ పక్క ఒరిగిన నా కోసం వెన్నెలల్లే జారిన చిరునవ్వు
వాలే రెప్పల మీదుగా నా తల నిమిరే నువ్వు  
జీవితమంతా ఈ ఒక్క క్షణంగా మారిపోవాలనే తీరని ఆశ
మాటల కోటలకు అందని ఈ స్పర్శను వర్ణించే ఓడిన ప్రయాస
అమ్మను సృష్టించిన అమృత హస్తాలకు .. ఇష్ట బానిస ...
--------Joice
 Oct 28 2009


Sudhamgaa suprabhathapu sambraanilaa gadulanni kaliya dirigina sanna gajjela melkolupu
Gundechappullaku kruthagnathagaa nalichina maruvapu kommantha kammani udaya praardhanalu
 Raalina usiri poolatho poteepade nee cheethikobbari eenelu
 Thadaarani premaku marala viraga boosina tellachemanthulu
 Ginnelaku sarigamalu  nerputhu chethi matti gaajulu
Alasi sardina mungurula dhaatiki muddugaaa vonike chevi buttalu
 Munivella maayalaa mooredu daaraaniki poochina poolapetalu
 Nidura kougitloki jaarchenduku nuvu turimina virajaajula jolapaatalu
 Magathagaa vinipinche keechuralla gusagusala madhya oopirantha vechani vesavi guruthulu..........

Aakasapu pandakki mustaabaina jaabilli koonalu chukkalu
Meeghaalanu tosukuntu jaabilamma jilugulu
Nee pakka origina naa kosam vennelalle jaarina chirunavvu
 Vaale reppala meedugaa naa thala nimire nuvvu
Jeevithamanthaa ee okka kshanamgaa maaripovaalane teerani aasa
 Maatala kotalaku andani ee sparsanu varninche odina prayaasa
 Ammanu srushtinchina ......amrutha hastaalaku ishta baanisa

Wednesday, August 26, 2015

Ajeyudu

అస్తమించే సూర్యునికి అర్జీ పెడుతన్నావా వెర్రితనమా!

ఆశువులకు ఆశ్రయమిచ్చిన అమాయకత్వమా
కోటి సూర్యుల తేజస్సును మించిన మహిమగలవాడు నీ ప్రియుడు

అస్తమించని వాడు అంతమే లేనివాడు

అల్పమైన అలజడులకు కలత చెందకు
ఆప్తుడైన వాడు అజేయుడు!
---------------------------------------------------
Astaminche suryuniki arjee peduthannaavaa verrithanama!

Aasuvulaku aasrayamichina amaayakatvamaa
Koti suryula tejassunu minchina mahimagalavaadu nee priyudu

Astaminchani vaadu anthame leni vaadu

Alpamaina alajadulaku kalatha chendaku
Aapthudaina vaadu Ajeyudu


-Post from 2013

Dances over me! Zephania 3:17

నీ కురుల సంఖ్యను గణించే నేను
 కన్రెప్పలా కాచుకున్నాను, కరములలో చెక్కుకున్నాను
 కలతల కన్నీటిలో తోడున్నాను
 మరణమైన వేరు చెయ్యలేనంత దగ్గరయ్యాను
 యుగములకు ముందే నిన్నుకలగన్నాను
 ఆకారమైనా దాల్చని నీకై ఆహుతయ్యాను
 తరాల కొద్దీ వేచి చూసాను
 నా ప్రేమనెరిగి కన్నీరైన నీతో నే ఏకమయ్యాను
 నిను గెలిచిన ఆనందం తాళలేను
 పరవశించి నాట్యమాడుతున్నాను!!

- A post from 2013

kanna koothuru


తెల్లవారు ఝాము లేచి వాకిలూడ్చే నీకు  సాయమవ్వాలని .....
ఏళ్ళ తరబడి నాకు వండివార్చిన నీకు వండి పెట్టాలని ....
పండగంటే తలకు మించి పనులు పెట్టుకునే నీకు చేయ్యందియ్యాలని ........
అనురాగాల అమ్మకు .... అడగకముందే అన్నీ చేసిపెట్టాలని 
ఆత్రమై తరలి వస్తున్న... నీ ఆనందాన్ని ....................

అలల నాన్న  పాటకు మరల లీనమై   చిందులెయ్యాలని ....
నన్ను ఉడికించి, తమ్ముడితో కలిసి ముసిముసి నవ్వులాడే ఆ పసితనం...పాఠమై  నేర్వాలని  
నీకొరకు వేల ప్రార్ధనలు ..వచనాలలో చేర్చి ..చేతనైతే కవితలుగా కూర్చి ...
అడిగిన ఈవులు కలలకు మించి నిజమవ్వాలనే కాంక్షనై ...
కళలు  కొలువున్న ఆ వరాల పొదరింట కానుకై వస్తున్నా ..నీ  కన్న కూతురిని ...

-Nov 14'th