Thursday, December 1, 2011

vaakyam(Word)


తేనే కన్నా మధురమన్నారు
చీకటి త్రోవకు వెలుగన్నారు
ఏది అతిశయోక్తి కాదని అర్ధమౌతోంది
కోటి  కల్లోలాలకు స్వాంతన దొరికింది
 యుద్ధాలను గెలిచే బలము చేకూరింది
బరువైన ఊపిరి తేలిక పడింది

 ఈ జీవికి ఆయువు నీ వాక్కు
తెన్నులేని నా బాటకి నీవే దిక్కు
గురి  నుంచి  సడలనియ్యకు ఎక్కు
దినము క్షణమనే విభజన లేని కాలంలో
నీ స్వరమో పాటగా మార్మోగనీ మదిలో

Wednesday, September 28, 2011

ముత్యాల మూట

నాలుగు వారాలు నీళ్ళలా గడిచిపోయాయి ...
కూర్చుకున్న జ్ఞాపకాలు జీవితకాలం నిలిచిపోతాయి ...
సగమే బ్రతికున్నా ఆశ్చర్యమేముంది
అమ్మ ఒడి లో మిగతా సగం ఆదమరిచింది
ముద్దుల మా అమ్మకు మూటెడు  ముద్దులు
బంగారు నాన్నకు బోలెడు నవ్వులు
చెల్లితమ్ముళ్ళతో ఆటలు పాటలు
చిన్నారి చెలియలకు చల్లని కబుర్లు
ఊపిరి బిగపట్టి కాలమాపగలిగితే   ఎంత బాగుండు !
కంతామణీ గడియారం వెనక్కి తిప్పకు
శతమానమూ  ప్రయత్నించినా,  గతం  తిరిగిరాదు
నిన్న బ్రతికున్నందుకు కృతజ్ఞతల వెల్లువయ్యాను..
బరువెక్కిన జ్ఞాపకాల సంచిలో మరిన్ని వజ్రాలుచూసి మురిసిపోతున్నాను ............ 



(found it digging through my email..wrote it sometime in early 2011..few days after my return from India Jan 9 2011)

Monday, May 2, 2011

I harken!

He relentlessly sings this over His beloved ------------------------------------------------------------


Share with me your hearts burdens
Share with me your hidden wounds
Share with me your worst fears
Share with me your silent smiles
Share with me your joyful thunders
Share with me your consuming passion
Share with me your dreams, I harken