Friday, June 29, 2012

గాయాల చిరునామా??

శరత్ ,హేమంత, శిశిర,  గ్రీష్మాల లోనూ
ఆటపాటల వసంతమే అనుభవిస్తున్నా ...
గానమాపని ఈ   గువ్వ రాగాలకు కాలపరిమితి లేదు...
నాట్యమాడే ఈ మయూరం అలుపన్నది ఎరుగదు...
గుండెలో నువు  నింపిన ఆనందం ముందు
గాయాల చిరునామాకు ఇక చెల్లు లేదు
(june 21,2012.)Friday, June 22, 2012

తరిగిపోయే తాత్కాలికం

ఎదలో సుడిగుండాలు నిండిన సముద్రం ...
ఒడ్డున అలలతో చిందులు మానలేదు ! 
నడిసంద్రాన నిలువు ధైర్యమున్ననావ...
ప్రళయపు హోరు చూసి పయనమాప లేదు !
నీతో శాశ్వత మైన  నేను..
తాత్కాలికాన్ని చూసి స్తంభించలేను !

(june 21'st)Wednesday, June 20, 2012

విశ్వాస పాత్రుడు !


కలలు కనే  కోమలాంగీ
కడు దుఖం  లో  కున   దేలుతున్నవా?
కలతలన్నీ  కర్పూరపు  ముద్దై కరిగిపోయే  రోజు  కడు  చేరువ  లో  ఉంది ..
కడలి  తరంగపు  నీ  ఉరకలాపకు
ఊరుకో  మాయమ్మ   వరాల  కొమ్మ..
వలచిన  ప్రియుడు  వీరుడు .విశ్వాస  పాత్రుడు !

may 4'th 2012