Thursday, December 31, 2009

నా డైరీ

చిరుకోపాలనీ చేతిరాతలనీ పంచుకుంది స్నేహితురాలు కాదు
కల్లోలాల్నీ కంటి మెరుపుల్నీ కడుపు లో దాచుకుంది అమ్మ కాదు
నేటి నుంచి నిష్క్రమిస్తూ నా గతపు మలుపుల్లో విడదీయలేని భాగమయ్యిందినా ఎర్ర అట్ట, బంగారు కాగితాల బుజ్జి డైరీ....అందుకో ఈ అబినందన
మన పరిచయం నాకు వరమయ్యింది..వీడ్కోలు వేళ మనసు బరువయ్యింది
నీ పేజీల మడతలలో నన్ను దాచుకుందామని మొదలెట్టి కొత్త నన్ను ఆవిష్కరించుకున్నా


మరో అక్షరానికి చోటులేకుండా నా నిన్నటిని సిరాగా నింపుకున్నావు
వేల కృతజ్ఞతలు చాలవు వెండి బంగారాలు వెల కట్టలేవు
పాత నేస్తంకి మల్లే కమ్మని జ్ఞాపకాల పరిమళం నువ్వు
దేవుడిచ్చిన అందమైన నిన్నటికి సాక్షం నువ్వు
నిజమవ్వబోతున్న నా ప్రార్ధనల చిట్టా నువ్వు
అవి నిజమైన ప్రతి ఉదయం మళ్లీ నిన్ను హత్తుకుంటా ..
అప్పటి వరకూ ఎదురుచూపులతో ఈ అలమరని అలంకరించు అరుదైన బహుమానమా ............
 
This dairy is my gift from Glory akka. Thanks once again. I completed it. I discovered my gift in words while filling it. It's a true blessing in my life. Immeasurably precious.

Saturday, December 19, 2009

Preethi akka's marriage gift!

ఒక ప్రక్క  దేవుని చిత్తానికై ఎదురుచూపులకు తెరదింపు ...
మరో ప్రక్క ఓ అందమైన ప్రణాళికకు మేల్కొల్పు
గువ్వ కన్నుల మా అక్కను వరుని చేతిలో పెట్టే సందర్భం
పాటల జలపాతం కోసం వెలసిన పెండ్లి మండపం
పరమతండ్రి ఏర్పరచిన పరిశుద్ధ వివాహం
ఉప్పొంగిన ఆనందోత్సాహాలే వేడుకగా మొదలైందీ సంబరం
ప్రీతిగా అందుకో ..పట్టుపీతంబరాలు కాక పది మాటల నా బహుమానం.

Joice చెల్లి.
............................................................................
............................................................................

Thursday, December 3, 2009

nanna

ఎవరి గురించి రాయాలో ఏమి రాయాలో అని సందిగ్ధం.
ఆ చేతిలో ఏమి వెచ్చదనమో చిన్న పిల్లనైపోతా నే కూడా నిజం!
ఈ కన్నుల పండగలో నీటి చుక్కలకి లేదు ఆహ్వానం
చిన్ని బంగారుతో నాన్నబంగారు, ముచ్చట్ల ముచ్చటైన ముహూర్తం
రువ్విన నవ్వులని మూటగట్టుకుంటుండగా స్తంభించింది కాలం
మౌనంగా నా చిరునవ్వుల్నీ, గతపు పేజీల్నీ దాచేస్తూ నా  నేటి లోకి తిరుగు ప్రయాణం
Tuesday, November 3, 2009

శుభముశుద్ధంగా సుప్రభాతపు సాంబ్రాణిలా,
గదులన్నీ కలియదిరిగిన సన్న గజ్జెల మేల్కొలుపు
గుండెచప్పుళ్ళకు కృతజ్ఞతగా నలిచిన మరువపు కొమ్మంత కమ్మని ఉదయప్రార్ధనలు
రాలిన ఉసిరి పూలతో పోటీపడే నీ చేతి కొబ్బరి ఈనెలు ---------( చీపిరి )
తడారని ప్రేమకు మరల విరగబూసిన తెల్లచేమంతులు
గిన్నెలకు సరిగమలు నేర్పుతూ చేతి మట్టి గాజులు
అలసి సర్దిన ముంగురుల ధాటికి ముద్దుగా వొణికే చెవి బుట్టలు
మునివేళ్ళ మాయలా మూరెడు దారానికి పూచిన పూలపేటలు
నిదుర కౌగిట్లోకి జార్చేందుకు నువు తురిమిన విరజాజుల జోలపాటలు

మగతగా వినిపించే కీచురాళ్ల గుసగుసల మధ్య ఊపిరంత వెచ్చని వేసవి గురుతులు

ఆకాశపు పండక్కి ముస్తాబైన జాబిల్లికూనలు చుక్కలు
మేఘాలను తోసుకుంటూ జాబిలమ్మ జిలుగులు
నీ పక్క ఒరిగిన నా కోసం వెన్నెలల్లే జారిన చిరునవ్వు
వాలే రెప్పల మీదుగా నా తల నిమిరే నువ్వు
జీవితమంతా ఈ ఒక్క క్షణంగా మారిపోవాలనే తీరని ఆశ
మాటల కోటలకు అందని ఈ స్పర్శను వర్ణించే ఓడిన ప్రయాస
అమ్మను సృష్టించిన అమృత హస్తాలకు .. ఇష్ట బానిస ...

--------.J


Thursday, October 1, 2009

Preethakka's surprise bridal shower


Blessings and grace He showered on his bride…….
A downpour of love intense yet mild...
His will unveiled; come behold its perfection...
Bless preethi as her anticipation ends in celebration.

(bridal shower invitation card. My first ever printed poem) 

Wednesday, September 16, 2009

Gud night:)

వీచే గాలిలో పరిమళింపు నై వచ్చా .....
కొమ్మా.. నీవు క్షేమమా .......
వెన్నెల రాత్రి పొగ మంచునై వచ్చా ..
నెలవంకా నీకు జోల పాడనా...
కనుల వాకిళ్ళు మూసి పడతి నిద్రించే వేళ....
కమ్మని కలల కై పరమ తండ్రిని వేడనా...
దూతల కావలిలో నిను కన్రెప్పలా కాచే కర్తను .... వేనోళ్ళా పొగడనా .......

My way of saying good night..............hahaha........

Saturday, September 5, 2009

My Love

I’m in love with this mystery..unleashing bit by bit..
I’m in love with this cloud..falling gently drop by drop..
I’m in love with this ocean..depositing pearls wave by wave..
I’m in love with this silence .. Speaking volumes and volumes..
I’m in love with this closeness..trembling me..as I step from
                                                                                      glory to glory..


-Jo

Saturday, August 29, 2009

demons and angels exclaim

Death and grave.......it conquered.
Curses and Bondages ...............it broke.
Emptiness and distances........it filled.
Fears and doubts .....it deleted.
As a flood and a flame it overcame.

What a kind of love is this..........that bore my shame and blame..
What a kind of love is this .....that demons and angels exclaim...
immense ...intense and what else....
Can take years to explain..how come in a line..
May be not in a line but in one name...JESUS

-- Holy Spirit
Monday, August 24, 2009

Come into my heart

Waiting as a night for a single ray of light
Come flow like a sunshine in this dark valley .
Rain until my desert turns to ocean .
Fill these empty hands..
with love deeper than a lifetime's excavation……..
Only dry and wet seasons my eyes knew
Come like a new season Lord…… Stay forever.

Friday, August 7, 2009

RUN TO YOUR ARMS

When all my being trembles to face the world
I’ll run to your arms
When every moment I live is hurting me
I’ll run to your arms
When this pain strikes me down
I’ll run to your arms
When each day continues proving me worthless
I’ll run to your arms
When my eyes couldn’t contain this abundance of waters
I’ll run to your arms
Hold me tight O God
That I can hear your heart instead of my own……


Joice

నవ్వుల విందు నా friendu

నేనెదురు చూసిన నవ్వుల విరి వాన ......
నా మనసైన జ్ఞాపకాల తలుపుల గుండా ప్రవహించే తియ్యని వేణువు ...
అందమైన బాల్యపు అపురూపమైన నేస్తం....
అల్లిబిల్లి ఆటలలో నా చిరకాల జట్టు ....


నిన్నటి గిన్నిగిరలో నీ చెయ్యి నా చేతిలో ఉన్నట్టే ఉంది ......
ఎప్పుడు తెల్లవారింది నేస్తం .....చలువ వెన్నెల దాటిపోయింది . సూర్యుడుదయించేసాడు...
చదువు సంధ్యలంటూ ఇలా వేల లక్షల కిలోమీటర్ల కావల సముద్రాలు దాటివచ్చేసా ..
కాని ...మరొక్క వెన్నెల సాయంత్రం కోసం ఎదురుచూస్తున్నా ...
ఆటలాడే నా బాల్యం కోసం ...
మనసైన ఆ మరువలేని నేస్తం కోసం ....
అంటే నీ కోసమే జెస్సి బంగారం ...

complexity ఎక్కువయ్యిందా ..?In short I miss u a lottttt
With loooooooooooots of love to my sweet and dearest twin sister.......
GOD BLESS U

glory akka

మల్లెలు పూచే మాసంలో మేలిమి ముత్యం పుట్టిందన్నమాట ..
అందాల చందమామ నుండి వెన్నెల కురిసినట్లు ...స్వచ్చమైన ప్రేమ కురుస్తుందా కంట..
నువ్వడుగు పెట్టిన ఇంట వెలుగులు వర్షించాలంట..........
నీ పేరు తో మేల్కొన్న ఈ జ్ఞాపకాల ఖజానా తిరిగి నింపుతా... ఉంటా.

love you akka,
Joice.

నీ.....నేను .

నిన్ను చూడకుండా బ్రతికేస్తున్నా......?
ఆశ్చర్యపోవటం మానేసా అలవాటుచేసుకున్నా
తలుచుకోగానే ఇలా నా కళ్ళని గుండెని నింపేస్తావ్ ........
ఈ దూరం బాహ్యమే...మనసుకి ఎప్పటిలా ..ఈరోజుకీ. దగ్గరే ఉన్నావ్.........

 ఈ  వినిపించని వేల నిట్టూర్పుల్ని నాలుగక్షరాలుగా కుర్చేస్తున్నా...
తేనెలమ్మ పై ప్రేమ వర్షం కురవాలని పరమ తండ్రిని ప్రార్ధిస్తూ ముగిస్తున్నా ..
ఇట్లు,
వేల ముద్దులతో
...నీ.....నేను .


(honey akka ki naa US uttaram)

ఈ హృదయాలయానికి ఆహ్వానం.


ఒక్క వెలుగు కిరణం కోసం రాతిరల్లే ఎదురుచూస్తున్నా ..
ఈ చీకటి లోయలో సూర్యోదయమై ప్రవహించు .
నిట్టూర్పుగా ఇసుకల్లే రాలుతున్నా ......
ఈ ఎడారి సంద్రమయ్యేంతగా వర్షించు .
జీవితకాలపు తవ్వకాలకన్నా లోతైన ప్రేమను ఈ దోసిట్లో నింపు .........


తడి పొడి ఋతువులు మాత్రమే తెలిసిన  ఈ కంటికి,
కొత్త రుతువల్లే రా దేవా .....
జీవితకాలం నిలిచిపో........

--J


Maa thammudu - Noble


పద్దెనిమిదేళ్ళ అనుబంధం ...........ఒక పూలతోట .......
వేల పున్నముల వెన్నెల వెలుగు .....నువ్వున్న నా గతం ....
గొప్ప పాటకారుడు కట్టిన అలల బాణీ ...........
నిన్ను నా పుస్తకంలో రచించిన మహా కవికి జీవితకాలపు బానిసనవ్వొచ్చు ....
అమ్మ.....అంత కమ్మని తమ్ముడు....

 
.
(I miss u thammu. I thank GOD for  wonderful lovely bro...Noble You ROCKKK!!!)


Wednesday, June 24, 2009

Bday's

Sunny's Bday on deepavali(Oct 24)

ఆకులు కాక కేకులు తినే మేక
పుట్టినందుకు వెలుగుల వేడుక
రావాలని ఉన్నా రాలేక ..
దీవిస్తూ పంపుతున్నా ఈ లేఖ

(My younger bro's bday on diwali.......meka his last name........meka. sunny prakash:)       )

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Swathi Chungath (Nov 1'st)

You are Blessed by the nations......

Lovingly chosen for HIS presence.......
Woman of faith and prudence
Happy Birthday Princess!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
My dear friendini

Not sending a thousand roses ......
Nor a closet full of clothes....
With all my heart I mean these words.....
You are more than a memory....a friend so close..
wish I could erase the things of past....
since I can't ...I'd suggest get over them fast
New year new beginning.........
A new friendship never ending..
New you and new me
Friends forever so it be..........

God Bless the year ahead of you pretty lady


----------with love Jo

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Amit Thammi's Bday on Thanksgiving day
 
One more reason to be Thankful today.....
 For a new year of blessings and mercies I pray........
May you climb every mountain that comes your way...
.Happy Bday bro,Have a nice day !OK....


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
  Ujwala Zion's B'day Nov 27'th
 
Mount Zion!! A mark of beauty and deity.......
A mark of strength and might....
A mark of His covenant our delight...
blow your trumpet declaring His kingdom...
Mark your world for generations to come..
May His Glory descend in a way you cud hardly fathom.......
Happy Bday you beautiful emblem:))