Wednesday, August 26, 2015

Ajeyudu

అస్తమించే సూర్యునికి అర్జీ పెడుతన్నావా వెర్రితనమా!

ఆశువులకు ఆశ్రయమిచ్చిన అమాయకత్వమా
కోటి సూర్యుల తేజస్సును మించిన మహిమగలవాడు నీ ప్రియుడు

అస్తమించని వాడు అంతమే లేనివాడు

అల్పమైన అలజడులకు కలత చెందకు
ఆప్తుడైన వాడు అజేయుడు!
---------------------------------------------------
Astaminche suryuniki arjee peduthannaavaa verrithanama!

Aasuvulaku aasrayamichina amaayakatvamaa
Koti suryula tejassunu minchina mahimagalavaadu nee priyudu

Astaminchani vaadu anthame leni vaadu

Alpamaina alajadulaku kalatha chendaku
Aapthudaina vaadu Ajeyudu


-Post from 2013

Dances over me! Zephania 3:17

నీ కురుల సంఖ్యను గణించే నేను
 కన్రెప్పలా కాచుకున్నాను, కరములలో చెక్కుకున్నాను
 కలతల కన్నీటిలో తోడున్నాను
 మరణమైన వేరు చెయ్యలేనంత దగ్గరయ్యాను
 యుగములకు ముందే నిన్నుకలగన్నాను
 ఆకారమైనా దాల్చని నీకై ఆహుతయ్యాను
 తరాల కొద్దీ వేచి చూసాను
 నా ప్రేమనెరిగి కన్నీరైన నీతో నే ఏకమయ్యాను
 నిను గెలిచిన ఆనందం తాళలేను
 పరవశించి నాట్యమాడుతున్నాను!!

- A post from 2013

kanna koothuru


తెల్లవారు ఝాము లేచి వాకిలూడ్చే నీకు  సాయమవ్వాలని .....
ఏళ్ళ తరబడి నాకు వండివార్చిన నీకు వండి పెట్టాలని ....
పండగంటే తలకు మించి పనులు పెట్టుకునే నీకు చేయ్యందియ్యాలని ........
అనురాగాల అమ్మకు .... అడగకముందే అన్నీ చేసిపెట్టాలని 
ఆత్రమై తరలి వస్తున్న... నీ ఆనందాన్ని ....................

అలల నాన్న  పాటకు మరల లీనమై   చిందులెయ్యాలని ....
నన్ను ఉడికించి, తమ్ముడితో కలిసి ముసిముసి నవ్వులాడే ఆ పసితనం...పాఠమై  నేర్వాలని  
నీకొరకు వేల ప్రార్ధనలు ..వచనాలలో చేర్చి ..చేతనైతే కవితలుగా కూర్చి ...
అడిగిన ఈవులు కలలకు మించి నిజమవ్వాలనే కాంక్షనై ...
కళలు  కొలువున్న ఆ వరాల పొదరింట కానుకై వస్తున్నా ..నీ  కన్న కూతురిని ...

-Nov 14'th