Wednesday, August 26, 2015

kanna koothuru


తెల్లవారు ఝాము లేచి వాకిలూడ్చే నీకు  సాయమవ్వాలని .....
ఏళ్ళ తరబడి నాకు వండివార్చిన నీకు వండి పెట్టాలని ....
పండగంటే తలకు మించి పనులు పెట్టుకునే నీకు చేయ్యందియ్యాలని ........
అనురాగాల అమ్మకు .... అడగకముందే అన్నీ చేసిపెట్టాలని 
ఆత్రమై తరలి వస్తున్న... నీ ఆనందాన్ని ....................

అలల నాన్న  పాటకు మరల లీనమై   చిందులెయ్యాలని ....
నన్ను ఉడికించి, తమ్ముడితో కలిసి ముసిముసి నవ్వులాడే ఆ పసితనం...పాఠమై  నేర్వాలని  
నీకొరకు వేల ప్రార్ధనలు ..వచనాలలో చేర్చి ..చేతనైతే కవితలుగా కూర్చి ...
అడిగిన ఈవులు కలలకు మించి నిజమవ్వాలనే కాంక్షనై ...
కళలు  కొలువున్న ఆ వరాల పొదరింట కానుకై వస్తున్నా ..నీ  కన్న కూతురిని ...

-Nov 14'th

No comments:

Post a Comment