Thursday, December 31, 2009

నా డైరీ

చిరుకోపాలనీ చేతిరాతలనీ పంచుకుంది స్నేహితురాలు కాదు
కల్లోలాల్నీ కంటి మెరుపుల్నీ కడుపు లో దాచుకుంది అమ్మ కాదు
నేటి నుంచి నిష్క్రమిస్తూ నా గతపు మలుపుల్లో విడదీయలేని భాగమయ్యింది



నా ఎర్ర అట్ట, బంగారు కాగితాల బుజ్జి డైరీ....అందుకో ఈ అబినందన
మన పరిచయం నాకు వరమయ్యింది..వీడ్కోలు వేళ మనసు బరువయ్యింది
నీ పేజీల మడతలలో నన్ను దాచుకుందామని మొదలెట్టి కొత్త నన్ను ఆవిష్కరించుకున్నా


మరో అక్షరానికి చోటులేకుండా నా నిన్నటిని సిరాగా నింపుకున్నావు
వేల కృతజ్ఞతలు చాలవు వెండి బంగారాలు వెల కట్టలేవు
పాత నేస్తంకి మల్లే కమ్మని జ్ఞాపకాల పరిమళం నువ్వు
దేవుడిచ్చిన అందమైన నిన్నటికి సాక్షం నువ్వు
నిజమవ్వబోతున్న నా ప్రార్ధనల చిట్టా నువ్వు
అవి నిజమైన ప్రతి ఉదయం మళ్లీ నిన్ను హత్తుకుంటా ..
అప్పటి వరకూ ఎదురుచూపులతో ఈ అలమరని అలంకరించు అరుదైన బహుమానమా ............
 
This dairy is my gift from Glory akka. Thanks once again. I completed it. I discovered my gift in words while filling it. It's a true blessing in my life. Immeasurably precious.

Saturday, December 19, 2009

Preethi akka's marriage gift!

ఒక ప్రక్క  దేవుని చిత్తానికై ఎదురుచూపులకు తెరదింపు ...
మరో ప్రక్క ఓ అందమైన ప్రణాళికకు మేల్కొల్పు
గువ్వ కన్నుల మా అక్కను వరుని చేతిలో పెట్టే సందర్భం
పాటల జలపాతం కోసం వెలసిన పెండ్లి మండపం
పరమతండ్రి ఏర్పరచిన పరిశుద్ధ వివాహం
ఉప్పొంగిన ఆనందోత్సాహాలే వేడుకగా మొదలైందీ సంబరం
ప్రీతిగా అందుకో ..పట్టుపీతంబరాలు కాక పది మాటల నా బహుమానం.

Joice చెల్లి.
............................................................................
............................................................................

Thursday, December 3, 2009

nanna

ఎవరి గురించి రాయాలో ఏమి రాయాలో అని సందిగ్ధం.
ఆ చేతిలో ఏమి వెచ్చదనమో చిన్న పిల్లనైపోతా నే కూడా నిజం!
ఈ కన్నుల పండగలో నీటి చుక్కలకి లేదు ఆహ్వానం
చిన్ని బంగారుతో నాన్నబంగారు, ముచ్చట్ల ముచ్చటైన ముహూర్తం
రువ్విన నవ్వులని మూటగట్టుకుంటుండగా స్తంభించింది కాలం
మౌనంగా నా చిరునవ్వుల్నీ, గతపు పేజీల్నీ దాచేస్తూ నా  నేటి లోకి తిరుగు ప్రయాణం