Friday, May 4, 2012

ప్రార్థన


చెలిపై సర్వాధికారాలు నీవని శంఖమై మ్రోగాను..
గాయాల నీ తనువు నా క్షేమ వస్త్రమనీ చెబుతూనే ఉన్నాను..
సర్వసృష్టికధిపతీ నీ సొత్తైన నాపై అల్పుల దాడి ... ఎంత ధైర్యం!
రోషము గలవాడివని తెలుసు నాకు ...
అక్రమంగా చొరబడిన అన్యాయపు వ్యాపారులపై కొరడా తీయి!

No comments:

Post a Comment