Wednesday, August 26, 2015

Dances over me! Zephania 3:17

నీ కురుల సంఖ్యను గణించే నేను
 కన్రెప్పలా కాచుకున్నాను, కరములలో చెక్కుకున్నాను
 కలతల కన్నీటిలో తోడున్నాను
 మరణమైన వేరు చెయ్యలేనంత దగ్గరయ్యాను
 యుగములకు ముందే నిన్నుకలగన్నాను
 ఆకారమైనా దాల్చని నీకై ఆహుతయ్యాను
 తరాల కొద్దీ వేచి చూసాను
 నా ప్రేమనెరిగి కన్నీరైన నీతో నే ఏకమయ్యాను
 నిను గెలిచిన ఆనందం తాళలేను
 పరవశించి నాట్యమాడుతున్నాను!!

- A post from 2013

No comments:

Post a Comment