అమావాస్య కాలంలో వెన్నెల వర్షానికై ఎదురుచూపులు
నిశ్శబ్దం స్థానే ఆనందపు ఉరుములు వినదలిచిన చెవులు
కలగనే ధైర్యమున్న వివేకినా?
కలతను స్నేహించలేని మూర్ఖత్వమా ?
ఎడారిలో సముద్రపొడ్డు నిర్మిస్తున్నా
అడవి బూడిదలో అమృతాన్ని వెతుకుతున్నా
కాసుల వర్షాన్ని కలగంటున్న నెలజీతగాణ్నా?
సకలైశ్వర్యవంతుడు నా తండ్రని ధీమానా?
కనులలో వగపు కాదు నగవులు నింపుకున్నా
కాటికి కాదు కళ్యాణానికి సిద్ధపడుతున్నా
పరిస్థితులకి తలవంచకపోవటం వెర్రితనమా?
పిలిచిన నీపై నమ్మకమా?
నివురు గప్పిననిప్పులో అగ్నినేత్రాల ఆవశ్యకత
నిలువుటద్దానికి మించిన ప్రతిబింబానికి కాంక్ష
దూరాన్ని నిందించలేని నాది చేతకానితనమా
నీ మనసెరిగిన అర్ధాంగి లక్షణమా !
No comments:
Post a Comment