చిరుకోపాలనీ చేతిరాతలనీ పంచుకుంది స్నేహితురాలు కాదు
కల్లోలాల్నీ కంటి మెరుపుల్నీ కడుపు లో దాచుకుంది అమ్మ కాదు
నేటి నుంచి నిష్క్రమిస్తూ నా గతపు మలుపుల్లో విడదీయలేని భాగమయ్యింది
నా ఎర్ర అట్ట, బంగారు కాగితాల బుజ్జి డైరీ....అందుకో ఈ అబినందన
మన పరిచయం నాకు వరమయ్యింది..వీడ్కోలు వేళ మనసు బరువయ్యింది
నీ పేజీల మడతలలో నన్ను దాచుకుందామని మొదలెట్టి కొత్త నన్ను ఆవిష్కరించుకున్నా
మరో అక్షరానికి చోటులేకుండా నా నిన్నటిని సిరాగా నింపుకున్నావు
వేల కృతజ్ఞతలు చాలవు వెండి బంగారాలు వెల కట్టలేవు
పాత నేస్తంకి మల్లే కమ్మని జ్ఞాపకాల పరిమళం నువ్వు
దేవుడిచ్చిన అందమైన నిన్నటికి సాక్షం నువ్వు
నిజమవ్వబోతున్న నా ప్రార్ధనల చిట్టా నువ్వు
అవి నిజమైన ప్రతి ఉదయం మళ్లీ నిన్ను హత్తుకుంటా ..
అప్పటి వరకూ ఎదురుచూపులతో ఈ అలమరని అలంకరించు అరుదైన బహుమానమా ............
This dairy is my gift from Glory akka. Thanks once again. I completed it. I discovered my gift in words while filling it. It's a true blessing in my life. Immeasurably precious.
No comments:
Post a Comment