Wednesday, February 17, 2010

వీడ్కోలు కాదు వేడుకోలు

మరో సంవత్సరం తర్వాత ఏ దూర తీరాలలో ఉంటామో తెలియదు
ఏ దిక్కునువ్వున్నా  జీవితపు ఏ మలుపైనా మనమంతా ఒక్కటని మరువొద్దు
తోబుట్టువుల మధ్యుండే అనురాగం మనది,  చిన్నారి బోసినవ్వులంత విలువైనది
ఉజ్జాయింపులను మించిన వరమిది,   వేడుకలా  గడిచిపోయింది
జీవితం ఓ పుస్తకమైతే ...
మనం కలవాలని రచించిన మహా కవి కి నా మోకాళ్ళ దండ
జీవితం ఓ ప్రయాణమైతే ...
కలిసి నవ్విన ప్రతి జ్ఞాపకం ఓ కథ గా రేపటికి మోసుకెళ్దాం మర్చిపోకుండా ..
మా హరితవనం లో  కోకిల వేకువల నిత్యవసంతం నిండాలని ప్రార్ధిస్తా తప్పకుండా...


miss u haritha:(